మదనపల్లి: మదనపల్లి మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా ఎంపికైన శ్రీరామ్ చినబాబు గారికి తెలుగుదేశం పార్టీ బీఫామ్ అందజేశారు.
మంగళవారం మదనపల్లిలోని టీడీపీ కార్యాలయంలో గౌరవ మదనపల్లి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా గారు, రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు గారి చేతుల మీదుగా శ్రీరామ్ చినబాబు బీఫామ్ అందుకున్నారు.
ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షించారు.

