మదనపల్లి అక్టోబర్ 20 : మదనపల్లి మున్సిపల్ చైర్మన్ టిడిపి అభ్యర్థి శ్రీరామ్ చినబాబుకు టిడిపి పార్టీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, ఎమ్మెల్యే షాజహాన్ బాష కలసి బీఫామ్ అందజేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ అభ్యర్థి కైనా పార్టీ అధిష్టానం అధ్యక్షుడు ద్వారా బీఫామ్ ను అందజేయడం నిబంధన. ఈ సందర్భంగా స్థానిక టిడిపి కార్యాలయంలో సుగువాసి ప్రసాద్ బాబు, ఎమ్మెల్యే షాజహాన్ భాష చేతుల మీదుగా శ్రీరామ్ చినబాబుకు టిడిపి చైర్మన్ అభ్యర్థిగా భీమా అందజేశారు. ఈ కార్యక్రమంలో చినబాబు సోదరుడు యోగేశ్వర బాబు, యాదగిరి దొరస్వామి నాయుడు, టిడిపి నాయకులు పాల్గొన్నారు

