మదనపల్లె అక్టోబర్ 25 : మదనపల్లి మునిసిపల్ ఛైర్మన్ యన్.డి.ఏ కూటమి అభ్యర్థి బీసీ శ్రీరామ్ కుమార్ చినబాబును గెలిపించుకుందాం బీసీ కులాల నాయకుల వెల్లడి….. ఆదివారం శ్రీకృష్ణ కల్యాణ మండపంలో బీసీ కులాల నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి యెనుగొండ రాజగోపాల్ నాయుడు అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా కూటమి చైర్మన్ అభ్యర్థి శ్రీ రామ్ కుమార్ (చినబాబు)గారు విచ్చేసి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ ముద్దు బిడ్డగా ఎదిగిన నాయకుడు చినబాబును కూటమి పార్టీలు మదనపల్లి మునిసిపల్ ఛైర్మన్ అభ్యర్థి గా కేటాయించడం తో అందరూ కృతజ్ఞతలు తెలియచేస్తూ మునిసిపల్ పరిధిలో ఏ వార్డులో ప్రజా సమస్యలు ఏమి వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారం చేస్తాను అని ఆయన అన్నారు. బీసీల బిడ్డగా నన్ను ఆదరించి కూటమి అభ్యర్థులతో పాటు చైర్మన్ గా గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఇంకా చెప్పుకుంటూ పొతే రాష్ట్ర నిధులు, కేంద్ర నిధులు తెచ్చి మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తానని తెలిపారు.రాష్ట్ర స్థాయి లో నాకు ఉన్న మంత్రులు మరియు కూటమి పార్టీల నాయుకులతో నాకు ఉన్న పరిచయాలతో నిధులను తీసుకు వచ్చి మదనపల్లి ని సుందరం గా అభివృద్ధి చేసే భాద్యత నేను తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమం లో బీసీ నాయకులు మోడెమ్ వెంకటరమణ, బి కృష్ణ మూర్థి, డివి రమణ, కప్పల శ్రీరాములు, వై. కొండయ్య, నారా రెడ్డెప్ప,జె. రెడ్డెప్ప,ఓ. వీర భాస్కర్, పి. అంజి, నాగరాణి, శ్యామల, విజయమ్మ, శంకర్ యాదవ్, సురేష్ యాదవ్, హరికృష్ణ, మంజునాథ్,యలగిరి దొరస్వామి నాయుడు, రామ మూర్తి, నాగయ్య, ప్రభాకర్,టెంపర్ రాజేష్, వాల్మీకి శీన, కొడవలి బీసీ నాయకులు మణి,నాగరాజ, కొడవలి శివ ప్రసాద్ మాజీ మునిసిపల్ చైర్మన్,సి రామాంజులు, వీరభద్ర, వెంకటరమణ, పూజారి అంజి, బి సి నాయకులు ప్రభాకర్, లోకేష్, వేమయ్య, సొసైటీ రామచంద్ర, ఈడిగ సంఘం క్రిష్ణ మూర్తి, బొంబాయి దుర్గ బెస్త, విద్యార్ధి సంఘాల నాయకులు వి. ఉత్తన్న, గంగరాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
బీసీల అండతోనే టిడిపి విజయం
