ఖజానాకు ఆదాయం పెంపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలి

మదనపల్లి, సెప్టెంబరు 22 :
జిల్లాలో ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించేందుకు అన్ని ఆదాయార్జన శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. పన్నుల వసూళ్లలో పారదర్శకత, సమర్థత పెంచడంతో పాటు బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

మంగళవారం మదనపల్లి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, రవాణా, గనులు, అటవీ, పంచాయతీరాజ్, మున్సిపల్, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ తదితర ఆదాయార్జన శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో శాఖల వారీగా ఆదాయ వసూళ్లు, లక్ష్యాలు, పురోగతి, బకాయిలు, భవిష్యత్ కార్యాచరణపై కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఖజానాకు వచ్చే ప్రతి రూపాయి ఆదాయాన్ని క్రమబద్ధంగా సమీకరించేలా శాఖలు పనిచేయాలని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఆదాయ వృద్ధి సాధించేలా ప్రతి శాఖ స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *