మదనపల్లె: మదనపల్లెలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడిని మదనపల్లె నియోజకవర్గానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు రాటకొండ బాబురెడ్డి కలిశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై మాట్లాడారు. హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో మదనపల్లె ప్రాంతంలో ఉద్యానవన రంగం, రైతులు, వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలకు మరింత ఊతం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తమైంది.
