పటిష్ట బందోబస్తు మధ్య విజయవంతగా సీఎం పర్యటన

మదనపల్లె, అక్టోబర్ 3:

మదనపల్లెలో సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రి, అనంత్ అంబానీ ప్రముఖుల పర్యటన పోలీసుల పకడ్బందీ భద్రత నడుమ ఎలాంటి ఆటంకాలు లేకుండా అత్యంత విజయవంతంగా ముగిసింది.

కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ పర్యవేక్షణలో, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, సామాన్య ప్రజలకు మరియు ట్రాఫిక్‌‌కు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూశారు.

వీఐపీల భద్రతతో పాటే అత్యవసర సేవలకు ప్రత్యేక మార్గాలు కేటాయించి, ముందస్తు ప్రణాళికను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేశారు.

అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో అహర్నిశలు శ్రమించి, విధులు నిర్వర్తించి ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *