మదనపల్లె అక్టోబర్ 3: మదనపల్లి పట్టణం శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో అక్టోబర్ 10వ తేదీన కాకతాన్ పోటీలు నిర్వహించనున్నట్లు కళాశాల కరస్పాండెంట్ ఆర్ గురు ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం జ్ఞానాంబిక కళాశాలలో హాకతాన్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కంప్యూటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అనే అంశంపై నిర్వహించే ఈ పోటీలకు, పట్టణంలోని అన్ని డిగ్రీ కళాశాలలు చెందిన విద్యార్థులు హాజరు కావచ్చు అన్నారు.
పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ బహుమతి రూ.5వేలు, ద్వితీయ బహుమతికి రూ.3 వేలు, తృతీయ బహుమతికి రూ.2 వేలు అందిస్తారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రమాదేవి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు
అక్టోబర్ 10న హాకతాన్ పోటీలు
