మోడల్ స్కూల్‌లో విద్యార్థినికి విద్యుత్ షాక్

ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై తండ్రి ఆరోపణలు

నిమ్మనపల్లె, సెప్టెంబర్ 27: అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లె మోడల్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న రజిత (16) విద్యార్థిని విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడింది.

శనివారం కిటికీ పక్కన ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు విద్యార్థిని తండ్రి రవికుమార్ తెలిపారు. విద్యుత్ షాక్‌కు గురైన అనంతరం బాలిక కేకలు వేస్తున్నప్పటికీ, ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయులు వెంటనే ఆసుపత్రికి తరలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు.

తల్లిదండ్రులకు సమాచారం అందడంతో వెంటనే పాఠశాలకు చేరుకున్నామని, అనంతరం తీవ్రంగా గాయపడిన తమ కుమార్తెను మదనపల్లెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు రవికుమార్ తెలిపారు.

ఈ ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ, పాఠశాలలో విద్యుత్ భద్రతా చర్యలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు విచారణ చేపట్టాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *