మూడు రోజుల బ్యాంకు సమ్మె నేపథ్యంలో ఆర్‌బీఐ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 27:దేశవ్యాప్తంగా మూడు రోజుల బ్యాంకు సమ్మె కారణంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చర్యలు చేపట్టింది. సమ్మె ప్రభావంతో నిలిచిపోయే బ్యాంకింగ్ సేవలను దృష్టిలో ఉంచుకుని ఆదివారం బ్యాంకులు పూర్తిస్థాయిలో పనిచేయనున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.
ఖాతాదారులకు నగదు లావాదేవీలు, బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో సమ్మె కారణంగా ఏర్పడే ఇబ్బందులను కొంతవరకు తగ్గించే అవకాశం ఉంది.
