మదనపల్లె, ఆగస్టు 15: (gtvmedia)మదనపల్లి నివాసి,
అనంతపురం డిఎస్పీగా పనిచేస్తున్న ఎం చంద్రశేఖర్ కి రాష్ట్ర ప్రభుత్వం అతి ఉత్కృష్ట సేవా పతకాన్ని అందజేసింది. 80 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అనంతపురం పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో.. జిల్లా మంత్రి పయ్యావుల కేశవ చేతుల మీదుగా డిఎస్పి చంద్రశేఖర్ అవార్డు అందుకున్నారు. పోలీసు వీధుల్లో 25 ఏళ్లకు పైగా, ఎలాంటి రీమార్కులు లేకుండా, అత్యుత్తమ సేవలు అందించిన గాను ఈ అవార్డు దక్కిందని డిఎస్పి వెల్లడించారు. మదనపల్లిలో ఎస్సైగా విధులు నిర్వహించిన చంద్రశేఖర్, సీఐగా పదోన్నతితో క్రైమ్ బ్రాంచ్ సిఐ గా అనేక నేరాల నిందితులను అరెస్టు చేశారు. ఇటీవల డీఎస్పీగా పదోన్నతి పొందారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు.. ఉత్కృష్ట సేవ పథకాన్ని ఎంపిక చేయడంతో
మదనపల్లికి చెందిన పుర ప్రముఖులు డీఎస్పీ చంద్రశేఖర్ ని అభినందించారు.
డీఎస్పీ చంద్రశేఖర్ కు అతి ఉత్కృష్ట సేవా పతకం
