మదనపల్లి FRO ఆఫీసర్‌గా D. కృష్ణప్రసాద్ బాధ్యతల స్వీకరణ

మదనపల్లె, అక్టోబర్ 5: మదనపల్లి ఫారెస్ట్ రేంజ్‌కు నూతన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా D. కృష్ణప్రసాద్ గారు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లి రేంజ్ పరిధిలో అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, అడవుల అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ విధులు నిర్వహిస్తామని తెలిపారు. అటవీ సంపదను కాపాడటంలో సిబ్బంది సమన్వయంతో పనిచేస్తామని పేర్కొన్నారు.

నూతన ఎఫ్‌ఆర్‌ఓగా బాధ్యతలు స్వీకరించిన D. కృష్ణప్రసాద్ కు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *