చలో విజయవాడకు అనుమతి లేదు

జిల్లా ఎస్పీ హెచ్చరిక

మదనపల్లె, సెప్టెంబర్ 26
“చలో విజయవాడ” కార్యక్రమానికి వెళ్లేందుకు స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి అనుమతి లేదని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు.
అనుమతి లేని ఇటువంటి సామూహిక కార్యక్రమాలు, ర్యాలీలు లేదా ధర్నాలకు ఉద్యోగులు పూర్తిగా దూరంగా ఉండాలని ఆయన సూచించారు.

ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి ఎవరైనా ఈ కార్యక్రమానికి వెళితే వారిపై నిబంధనల మేరకు చట్టపరమైన, శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *