మదనపల్లె, సెప్టెంబర్ 15: ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను మదనపల్లె ఎమ్మెల్యే యం. షాజహాన్ బాషా లబ్ధిదారులకు అందజేశారు.
మదనపల్లె నియోజకవర్గానికి సంబంధించిన ఒక లబ్ధిదారుడికి, తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు కలిపి రూ.3 లక్షల విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా నాయకులతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ఆర్థిక సహాయం అందుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే యం. షాజహాన్ బాషాలకు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.

