అన్నమయ్య జిల్లా | మదనపలె:సెప్టెంబర్ 4
మదనపల్లె–పుంగనూరు ప్రధాన రహదారిపై 150వ మైలురాయి వద్ద శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాయచోటి మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
150వ మైలురాయి సమీపంలో బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్నట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన ఎంఈఓను 108 అంబులెన్స్‌లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై తాలూకా పోలీసులు వివరాలు వెల్లడించాల్సి ఉంది.
