
మదనపల్లె (క్రైమ్ న్యూస్):(gtvmedia )అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శనివారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దుకాణాలు మూసివేయాలని సూచించిన పోలీసులపై అధికార పార్టీకి చెందిన ఓ హోటల్ యజమాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.అసలేం జరిగింది?విధుల్లో భాగంగా మదనపల్లె వన్ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ శనివారం రాత్రి 10:30 గంటల సమయంలో బెంగళూరు బస్టాండ్ పరిసరాల్లో గస్తీ నిర్వహించారు. రాత్రి వేళల్లో నిర్దేశిత సమయం దాటడంతో, ప్రభుత్వ నిబంధనల మేరకు దుకాణాలు, హోటళ్లు మూసివేయాలని వ్యాపారులకు సూచిస్తూ వచ్చారు.ఈ క్రమంలో అధికార పార్టీ నాయకుడికి చెందిన మాంసాహార హోటల్ వద్దకు చేరుకుని, సమయం ముగిసినందున హోటల్ మూసివేయాల్సిందిగా ఎస్సై కోరారు.పోలీసులకే నేరుగా సవాల్!ఎస్సై సూచనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు హోటల్ యజమాని పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. “నేను హోటల్ మూసేది లేదు.. మీ చేతనైంది చేసుకోండి” అంటూ గట్టిగా అరుస్తూ పోలీసులకే సవాల్ విసిరారు. యూనిఫాంలో ఉన్న పోలీసుల ముందే బహిరంగంగా బెదిరింపు ధోరణిలో మాట్లాడటంతో స్థానికంగా కలకలం రేగింది.ఎస్పీ దృష్టికి వ్యవహారంఆన్ డ్యూటీలో ఉన్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంపై ఎస్సై చంద్రశేఖర్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ధీరజ్ దృష్టికి వివరాలు తీసుకెళ్లారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పోలీసుల విధులను అడ్డుకున్న వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

