ఉచిత సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం
తిరుమల, ఆగస్టు 30: (gtvmedia)తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ ఆదివారం సాధారణంగా కొనసాగుతోంది. వైకుంఠంలోని 20 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు.
ప్రస్తుతం వివిధ దర్శనాలకు పడుతున్న సమయం వివరాలు ఇలా ఉన్నాయి:
- ఉచిత సర్వదర్శనం: సుమారు 12 గంటలు
- టైమ్ స్లాట్ (SSD) టోకెన్ దర్శనం: సుమారు 5 గంటలు
- రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం: సుమారు 4 గంటలు
నిన్నటి శ్రీవారి దర్శన వివరాలు
ఆగస్టు 29న మొత్తం 85,246 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అదే రోజు 34,085 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
శ్రీవారి హుండీ ద్వారా రూ.4.30 కోట్ల ఆదాయం సమకూరినట్లు తిరుమల సమాచారం వెల్లడించింది.
