మదనపల్లె సెప్టెంబర్ 30: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేసేందుకు విచ్చేస్తున్న సీఎం చంద్రబాబు పర్యటన బహిరంగ బహిరంగ సభకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కర్నూలు రేంజ్ డీఐజీ పోయే ప్రవీణ్ ఆదేశించారు. బుధవారం మదనపల్లి పట్టణం బైపాస్ రోడ్డులో 32 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ స్థలాన్ని డిఐజి పరిశీలించారు.
ఈ సందర్భంగా బహిరంగ సభకు ప్రజలు ఎటువైపు నుంచి వస్తారు వీఐపీలు ఎటువైపు నుంచి రావాలి, మదనపల్లి కు నాలుగు హెలికాప్టర్లు వస్తున్నందున హెలిపాడ్ల నిర్మాణం అక్కడ బందోబస్తు డీఐజీ పర్యవేక్షించారు.
హెలిప్యాడ్ స్థలం నుంచి బహిరంగ సభ వరకు ఉన్న మూడు కిలోమీటర్ల దూరంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, ఎస్పీ ధీరజ్ , సీఎం వ్యక్తిగత భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.
సీఎం బహిరంగ సభకు పటిష్ట బందోబస్తు
