మదనపల్లె, అన్నమయ్య జిల్లా | సెప్టెంబర్ 30, 2026
అక్టోబర్ 2న మదనపల్లెకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం మదనపల్లె బీకే పల్లి ప్రాంతంలో జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి, అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి, అన్నమయ్య జిల్లా మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, జేసీ శ్రీ శివ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ శ్రీమతి చల్లా కళ్యాణి, స్థానిక ఎమ్మెల్యే శ్రీ షాజహాన్ భాష, పలమనేరు ఎమ్మెల్యే శ్రీ అమర్నాథ్ రెడ్డి, టీడీపీ పార్లమెంటరీ ఇన్చార్జి శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు, టీడీపీ జోనల్ ఇన్చార్జి శ్రీ సత్యకుమార్, పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల ఇన్చార్జులు శ్రీ మధుసూదన్, శ్రీ శంకర యాదవ్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, వివిధ శాఖల అధికారులు తదితరులతో కలిసి మంత్రులు హెలిప్యాడ్, గ్లోబల్ హార్టికల్చర్ హబ్ సభా ప్రాంగణాలను విస్తృతంగా సందర్శించారు.
ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో ప్రధాన వేదిక, గ్యాలరీలు, స్టాల్స్, ఇతర మౌలిక వసతుల ఏర్పాటు, హెలిప్యాడ్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, బ్యారికేడింగ్ తదితర అంశాలను మంత్రులు పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్, ఎస్పీ, జేసీ, ఇతర అధికారులతో సమగ్రంగా చర్చించారు.
ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని, భద్రతా చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని మంత్రులు అధికారులకు సూచించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని దిశానిర్దేశం చేశారు.
అక్టోబర్ 2న జరగనున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని సభా ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్, రాకపోకలు, భద్రత, బ్యారికేడింగ్ తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

