సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

మున్సిపల్, ఆర్‌అండ్‌బీ, ఏపీ ట్రాన్స్‌కో అధికారులతో ఎమ్మెల్యే షాజహాన్ బాషా సమీక్ష

మదనపల్లె, సెప్టెంబర్ 11: మదనపల్లె పట్టణంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అధికారులను ఆదేశించారు.

శుక్రవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో తలెత్తే సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించారు.

మున్సిపల్ అధికారులతో పాటు ఏపీ ట్రాన్స్‌కో డీఈ, ఆర్‌అండ్‌బీ అధికారులతో పట్టణానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

సమస్యలు తలెత్తిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే వాటిని గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *