ఘనంగా విశ్వకర్మ జయంతి

మదనపల్లె సెప్టెంబర్ 17 :
విశ్వకర్మ కేవలం దేవతల శిల్పి మాత్రమే కాదని, కష్టపడి పనిచేసే కార్మికులు, ఇంజనీర్లు, చేతివృత్తుల కళాకారులు అందరికీ ఆయన స్ఫూర్తి అని అదనపు ఎస్పీ వెంకటాద్రి కొనియాడారు.
గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో విశ్వకర్మ జయంతి నిర్వహించారు.
శ్రమ, పట్టుదల, నైపుణ్యం ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చనే గొప్ప సందేశాన్ని విశ్వకర్మ ద్వారా మనం నేర్చుకోవచ్చని ఆయన వివరించారు.

ఈ వేడుకల్లో ఆర్ఐలు రవికుమార్, రంగనాథ్ బాబు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఆదినారాయణ రెడ్డి మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *