రాయలసీమ రైతు సత్తాను ప్రపంచానికి చాటేలా హార్టికల్చర్ హబ్ నారా లోకేష్

మదనపల్లె, అక్టోబర్ 2: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నట్లు లోకేష్ తెలిపారు.

యువగళం పాదయాత్ర సందర్భంగా రాయలసీమలో రైతుల సమస్యలను స్వయంగా చూసిన అనంతరం హార్టికల్చర్ హబ్ ఆలోచన వచ్చిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఐఎస్‌బీ తరహాలో మదనపల్లెలో ఏర్పాటు కానున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా ఆధునిక సాంకేతికతను వ్యవసాయ రంగంతో అనుసంధానం చేసి, రాయలసీమ రైతుల సత్తాను ప్రపంచానికి చాటే అవకాశం ఏర్పడుతుందని లోకేష్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *