మదనపల్లి, అక్టోబర్ 23: మదనపల్లి AMC చైర్మన్ జంగాల శివరామ్ గారి ఆధ్వర్యంలో మదనపల్లి రూరల్ మండలంలో ఇద్దరు MPTC అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
వేంపల్లి పంచాయతీ MPTC అభ్యర్థిగా సువరపు చంద్రశేఖర్ గారి తల్లి సువరపు శ్యామలమ్మ గారు, CTM-1 క్రాస్ రోడ్ MPTC అభ్యర్థిగా V. వెంకటశివ గారు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల సందడి నెలకొంది.

