మదనపల్లె, సెప్టెంబర్ 9: మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. డీఎస్పీ బుచ్చిరాజు ఆధ్వర్యంలో రహదారులపై ఉన్న ఆక్రమణలను తొలగించి, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రోడ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
పట్టణంలోని ఎన్టీఆర్ జంక్షన్ నుంచి నిమ్మనపల్లి సర్కిల్ వరకు రహదారులపై ఉన్న ఆక్రమణలను తొలగించారు. దీంతో ట్రాఫిక్ రాకపోకలకు ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది.
ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రహదారులను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా చర్యలు కొనసాగుతాయని డీఎస్పీ బుచ్చిరాజు తెలిపారు. తొలగించిన ప్రాంతాల్లో తిరిగి ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
