అమరావతి, సెప్టెంబర్ 9: రాష్ట్రంలో దళితులపై దాడులు, హత్యలు, సామాజిక వివక్షపై గవర్నర్కు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ ఫిర్యాదు చేశారు. బుధవారం అమరావతిలోక భవన్ ముట్టడించిన బీఎస్పీ నాయకులకు పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతం కుమార్ కు గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్మెంట్ ఇవ్వడంతో ఆయన వెళ్లి కలిశారు.
గౌతమ్ మాట్లాడుతూ..
దళితులకు రక్షణ కల్పించడంలో, బాధితులకు సకాలంలో న్యాయం అందించడంలో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం విఫలమవుతున్నరన్నారు.
ప్రత్యేకంగా దళితులపై దాడులు జరిగినప్పుడు కేసుల నమోదు నుంచి దర్యాప్తు వరకు జరుగుతున్న జాప్యం, బాధిత కుటుంబాలకు భద్రత కల్పించాల్సిన అవసరం, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతపై బీఎస్పీ నాయకులు గవర్నర్కు వివరించారు.
“దళితులపై దాడులు జరుగుతుంటే బీఎస్పీ చూస్తూ ఊరుకోదు. బాధితులకు న్యాయం జరిగే వరకు, దళితులు–బహుజనులకు రాజ్యాంగబద్ధమైన హక్కులు, భద్రత కల్పించే వరకు బహుజన్ సమాజ్ పార్టీ పోరాటం ఆపదు” అని బందెల గౌతమ్ కుమార్ స్పష్టం చేశారు.
