మదనపల్లె, సెప్టెంబర్ 9: లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు, కరాటే మాస్టర్ మురళిని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభినందించారు.
ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన అమేచ్యూర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మార్షల్ ఆర్ట్స్ అవార్డ్స్–2026లో కరాటే మాస్టర్ మురళికి ఇంటర్నేషనల్ బ్రూస్ లీ అవార్డు లభించింది. ఈ సందర్భంగా మురళి తన విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు.
అదే కార్యక్రమంలో అకాడమీ సీనియర్ విద్యార్థిని కే. హారికకు ఇంటర్నేషనల్ ఐకాన్ బుద్ధ అవార్డు లభించింది. క్రమం తప్పకుండా కఠోర శిక్షణ పొందుతూ ప్రతిభ కనబరిచిన హారికను ఎస్పీ అభినందించారు.
అలాగే అకాడమీ విద్యార్థులు కె. మోక్షిత్, సి. పృథ్విక్ నందన్, సి. హార్మేంద్ర, వర్షల్, కే. ధనుష్లు ఇంటర్నేషనల్ కరాటే ఐకాన్ స్టార్ కిడ్ అవార్డులు అందుకున్నందుకు ఎస్పీ అభినందనలు తెలిపారు.
కరాటేలో ప్రతిభ కనబరుస్తూ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో కరాటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
