మదనపల్లి: మదనపల్లి పురపాలక సంఘం పరిధిలో కూటమి కౌన్సిలర్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి శ్రీ గుండ్లపల్లి శ్రీరామ కుమార్ (చినబాబు) ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. వివిధ వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకుని, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ప్రచారంలో భాగంగా 1వ వార్డు అభ్యర్థి మేకల రెడ్డి శేఖర్, 2వ వార్డు అభ్యర్థి మల్లేశ్వరి, 3వ వార్డు అభ్యర్థి కవిత, 5వ వార్డు అభ్యర్థి మల్లిక, 7వ వార్డు అభ్యర్థి రమణప్పలకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా చినబాబు మాట్లాడుతూ మదనపల్లి పట్టణ అభివృద్ధి, వార్డుల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. పట్టణ అభివృద్ధి కోసం ప్రజలందరూ ఐక్యంగా నిలిచి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.

మన మదనపల్లి – మన అభివృద్ధి – మన కూటమి!
#Madanapalle #Chinababu #TDP #Kutami #MadanapalleDevelopment #ElectionCampaign
