మదనపల్లె సెప్టెంబర్ 14 : మదనపల్లి మున్సిపాలిటీలో ఎన్నికలు నిర్వహించే క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో బీసీ, ఎస్టీ, ఎస్సీ ఓటర్ల జాబితాని విడుదల చేశారు. కమిషనర్ మాట్లాడుతూ ఈ ఓటర్లు జాబితాను అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద అందుబాటులో ఉంచామని, ఓటర్లు వెళ్లి వారి జాబితాలో ఓట్లు తనిఖీ చేసుకోవచ్చన్నారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 17వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు మున్సిపల్ కార్యాలయంలో లిఖితపూర్వకంగా అభ్యంతరం తెలపాలని కమిషనర్ కోరారు
మున్సిపాలిటీలో ఎస్సీ ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితా విడుదల
