మట్టి గణపతి తో పోలీసుల పూజలు

మదనపల్లె, సెప్టెంబర్ 14:
అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ‘మట్టి వినాయకుడి’ని ప్రతిష్ఠించి, పోలీసు అధికారులు పూజలు నిర్వహించారు.

తమ కుటుంబాలతో కలిసి పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
అదనపు ఎస్పీ వెంకటాద్రి పూజల్లో పాల్గొని, ప్రజల జీవితాల్లోని విఘ్నాలు తొలగిపోయి సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు.

అందరూ సమిష్టిగా, ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్న ఈ పండుగ.. జిల్లా పోలీసు కుటుంబాల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని మరింతగా పెంపొందించింది.

ఈ పూజలో ఎస్బి సీఐ యు. సదాశివయ్య, ఆర్ఐ లు, ఎం.రవికుమార్, యు.రంగనాథ్ బాబు, ఇతర అధికారులు, సిబ్బంది, హోంగార్డులు, పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *