- శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు!
- పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉన్నట్లు కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం బాధ్యతా రాహిత్యం.
- “వాస్తవానికి సదరు ఫొటోలో ఉన్నది శ్రీవారి లడ్డూ ప్రసాదం కాదు!” అని … టిటిడి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం అయ్యింది..!
- దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
- టీటీడీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
- ఫొటో మూలం, వాస్తవికత, ప్రచారం చేసిన వ్యక్తులపై దర్యాప్తు కొనసాగుతోంది.
- నిర్ధారణ కాని ఫొటోలు, పోస్టులు షేర్ చేయవద్దు.
📵 తప్పుడు సమాచారాన్ని వైరల్ చేయవద్దు.
- నిర్ధారణ కాని ఫొటోలు, వీడియోలు, పోస్టులు ఫార్వర్డ్/షేర్ చేయవద్దు.
- సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నిజమని నమ్మవద్దు.
- అధికారిక సంస్థలు విడుదల చేసే సమాచారాన్నే విశ్వసించండి.
- తప్పుడు సమాచారం కనిపిస్తే మరింత వైరల్ చేయకుండా అధికారులకు సమాచారం ఇవ్వండి.
⚖️ చట్టపరమైన చర్యలు.
భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా
ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేసినట్లు దర్యాప్తులో తేలితే, అమలులో ఉన్న చట్టాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం.
భక్తులకు విజ్ఞప్తి!.
పవిత్ర శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సంయమనం పాటించండి.
- అపోహలను నమ్మవద్దు.
- తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు సహకరించండి.
