మిట్స్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

మదనపల్లె, నవంబర్ 9: మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం జనవరి సెషన్‌కు సంబంధించి ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ పీహెచ్‌డీ పరిశోధన కార్యక్రమాల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ తెలిపారు.

యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, మేనేజ్‌మెంట్, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, ఇంగ్లీష్, గణితశాస్త్రం విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.

విశ్వవిద్యాలయ నిబంధనలు, అర్హత ప్రమాణాలతో పాటు మిట్స్ డాక్టోరల్ అడ్మిషన్స్ టెస్ట్ (MITSDAT 2026–27), ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్లు వివరించారు.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ నవంబర్ 25, 2026. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం www.mits.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

మరిన్ని వివరాల కోసం 9452690013, 9100973262 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.

ఈ సమావేశంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్, అడ్వైజర్ (R&D) డాక్టర్ తులసీరామ్ నాయుడు, డైరెక్టర్ – అడ్మిషన్స్ డాక్టర్ దీపాంకర్ రాయ్, అసోసియేట్ డీన్ డాక్టర్ నందకుమార్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *