మదనపల్లి మండల ఎంపీటీసీలకు ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఘన సన్మానం

మదనపల్లె, నవంబర్ 9:

ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మదనపల్లి మండల పరిధిలో కూటమి పార్టీల తరఫున ఘన విజయం సాధించిన ఎంపీటీసీ అభ్యర్థులతో మదనపల్లి ఎమ్మెల్యే శ్రీ షాజహాన్ భాషా గారు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా విజయం సాధించిన ఎంపీటీసీలకు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

అనంతరం విజయం సాధించిన ఎంపీటీసీలను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి అభినందించారు.

#Madanapalle #ShajahanBasha #MPTCElections #TDP #Janasena #Kutami

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *