రాష్ట్రంలో ఈనెల 26న పోలింగ్ నిర్వహిస్తున్న 23 పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రైవేట్ సంస్థలు, షాపులలో పనిచేసే వారికి, కంపెనీల్లో ఉద్యోగులు కూడా ఓటు హక్కు వినియోగించుకోడానికి వీలుగా అదే రోజు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నికలు నిర్వహిస్తున్న 23 చోట్లా వివిధ ప్రభుత్వశాఖల ఆధ్వర్యంలోని వాహనాలను పోలింగ్ అవసరాలకు వినియోగించుకునేందుకు కలెక్టర్లకు స్వాధీనం చేయాలని మరో ఉత్తర్వులో అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఎన్నికలు జరుగుతున్న పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 26న పోలింగ్ సెలవు
