ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ పులి దినోత్సవాన్ని పురస్కరించుకొని జంతుశాస్త్ర విభాగం, జాతీయ సేవా సమితి (ఎన్‌ఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో అటవీ శాఖ సహకారంతో పులుల సంరక్షణ, అటవీ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

మదనపల్లె, జూలై 29( gtvmedia )ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్.కె. సైదులు మాట్లాడుతూ, పులులు అడవులకు సంరక్షకులని, వాటి మనుగడను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణకు, ఆహార గొలుసు సమతుల్యతను నిలబెట్టడానికి పులుల పాత్ర అత్యంత కీలకమని వివరించారు. అలాగే వన్యప్రాణులకు హాని కలిగించే వారిపై అటవీ శాఖ చట్టాలు అత్యంత కఠినంగా అమలులో ఉంటాయని తెలిపారు.

జంతుశాస్త్ర అధ్యాపకురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ, పులుల సంరక్షణ ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని, ప్రతి విద్యార్థి ప్రకృతి పరిరక్షణలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ వై. వనజ, అధ్యాపకులు మోహనవల్లి, లలిత, విష్ణుప్రియ, రాజశేఖర్, సుబ్బరాయుడు, రేఖ పాల్గొన్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శివరంజని, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుధాకర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కిరణ్ కుమార్ పాల్గొని విద్యార్థులకు పులుల సంరక్షణ, అటవీ చట్టాలపై అవగాహన కల్పించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *