మదనపల్లె, సెప్టెంబర్ 16:
మదనపల్లె మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ బాబ్జి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన నేపథ్యంలో, మదనపల్లె ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా బుధవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.
స్థానిక నాయకులతో కలిసి బాబ్జి కుటుంబ సభ్యులను కలిసిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా, ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాబ్జి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే, అవసరమైన సహకారం అందించేందుకు తాను అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
