అన్నమయ్య జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు.
మదనపల్లె, సెప్టెంబర్ 13:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ నిశాంత్ కుమార్ జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి ఇల్లు సంక్షేమం, సౌభాగ్యం, సంతోషాలతో శోభాయమానంగా వెలుగొందాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లోని విఘ్నాలు తొలగిపోయి, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.
