మదనపల్లె అక్టోబర్ 17:
మదనపల్లె పట్టణంలోని రాజ్ భవన్ లాడ్జిలో 15-10-2026వ తేదీ తెల్లవారుజామున జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడైన నవీద్ పాష అలియాస్ గంజా నవీద్ (30)ను మదనపల్లె 1 టౌన్ పోలీసులు 17-10-2026వ తేదీన అరెస్ట్ చేశారు.
కర్ణాటక రాష్ట్రం, ముల్బాగల్ పట్టణానికి చెందిన నవీద్ పాషకు, మృతురాలు రుబియా తాజ్‌కు 2014లో వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో ముల్బాగల్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై గతంలో గృహహింస, హత్యాయత్నానికి సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలో తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన, జైలుకు పంపిన భార్యపై నిందితుడు కక్ష పెంచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తన భార్యను హత్య చేయాలనే జైలు నుండి విడుదల అయిన తరువాత ఉద్దేశంతో పథకం ప్రకారం ఆమెను తిరిగి కాపురానికి తీసుకువెళ్తానని నమ్మించి, 14-10-2026వ తేదీన రామసముద్రంలోని ఆమె తల్లి ఇంటి నుంచి తన ద్విచక్ర వాహనంపై మదనపల్లెకు తీసుకువచ్చాడు.
అనంతరం మదనపల్లె పట్టణంలోని రాజ్ భవన్ లాడ్జిలో భార్యతో కలిసి గది తీసుకున్నాడు. 15-10-2026వ తేదీ తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో, భార్య బాత్రూంలోకి వెళ్లిన సందర్భంలో బీరు సీసాలతో ఆమె తలపై దాడి చేసి, పగిలిన సీసాతో గొంతు కోసి హత్య చేసినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
నేరం అనంతరం నిందితుడు అక్కడి నుంచి తన ద్విచక్ర వాహనంపై పారిపోయి బెంగళూరుకు వెళ్లాడు. అనంతరం మదనపల్లెలో తనపై కేసు నమోదైనట్లు తెలుసుకుని, తన ద్విచక్ర వాహనాన్ని విక్రయించి బెయిల్ పొందాలనే ఉద్దేశంతో తిరిగి మదనపల్లెకు వస్తుండగా, అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మదనపల్లె–బెంగళూరు రహదారిలోని నక్కలదిన్నె ఆర్చ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలో పోలీసులను చూసి తప్పించుకోవడానికి ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మదనపల్లెలో భార్యను హత్య చేసిన కేసులో నిందితుడి అరెస్ట్
