చైర్మన్ అభ్యర్థి చినబాబు, 44వ వార్డు అభ్యర్థి బండి భారతికి మద్దతుగా గంగారపు రాందాస్ చౌదరి ఇంటింటి ప్రచారం

మదనపల్లె, అక్టోబర్ 30:

మదనపల్లె మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లె నియోజకవర్గ ఇంచార్జి గంగారపు రాందాస్ చౌదరి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మదనపల్లె మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థి శ్రీరామ్ చినబాబుకు సైకిల్ గుర్తుపై, 44వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బండి భారతికి గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఇంటింటికీ వెళ్లి స్థానిక ప్రజలను కలుసుకుంటూ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని, ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన అభ్యర్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *