మదనపల్లి జూలై31: (gtvmedia)రాష్ట్రంలో చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ పథకాల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న ర్యాలీని విజయవంతం చేద్దామని, చేనేత కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బిజెపి కార్యాలయంలో
ఓబీసీ మోర్చా నేతన్న నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు, ఓ బి సి మోర్చా జాతీయ కార్యదర్శి జబ్బల శ్రీనివాసులు మాట్లాడుతూ ఆగస్టు 5వ తేదీన విజయవాడ రాష్ట్ర బిజెపి కార్యాలయం నుంచి చేనేత నాయకులు భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తారు అన్నారు. ఈ కార్యక్రమానికి మదనపల్లి నుండి ఓబీసీ మోర్చా నాయకులు అందరూ కలిసికట్టుగా విజయవాడ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబిసి మోర్చా ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్, భువనేశ్వరి సత్య, సింహం శ్రీకాంత్, తొగటవీర క్షత్రియ నాయకులు పాల్గొన్నారు.
ఓబీసీ మోర్చా ర్యాలీని విజయవంతం చేద్దాం
