మదనపల్లె, ఆగస్టు 11: (gtvmedia)అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం నాయకులు, కార్యకర్తల మధ్య ఉత్సాహంగా కొనసాగింది. పట్టణంలోని 15, 16వ వార్డులు, కమ్మ వీధి, వాల్మీకి వీధి, రాగిమాను సర్కిల్ ప్రాంతాల్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మదనపల్లె ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే షాజహాన్ భాషా ప్రజలకు వివరించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించడంతో పాటు, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చైర్మన్ నాదెండ్ల విద్యాసాగర్, ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానం చైర్మన్ గంగారపు నవీన్ కుమార్ చౌదరి, రాష్ట్ర టీడీపీ సీనియర్ నాయకులు రాటకొండ మధుబాబు, బాలు స్వామి, జోలెపాలెం చిన్ని, రామ్మూర్తి నాయుడు, మార్పూరి నాగార్జున బాబు, కొత్తపల్లి రామ్మూర్తి, ప్రభాకర, శంకర, మదనపల్లె పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల అరుణ్ తేజ చింటూ, బోయపాటి రానా, వంటికొండ వెంకటేష్, బోయపాటి చలపతి, లక్ష్మీదేవి, బాబునాయుడు ,రాటకొండ భారతి,భవాని,రాధమ్మ,శ్యామలమ్మ,బయ్యన్న గారి భారతి,చలపతి, పూల మురళి, రాటకొండ సోమశేఖర్,నాగమణి,మాకినేని చంద్రశేఖర్,రైస్ మిల్ శశి,తాళ్ల గిరి తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఆయా ప్రాంతాల్లో సందడి నెలకొంది.
