దేశీ విత్తనాలతో బహుళ పంటలు సాగు చేయాలి

జిల్లా వ్యవసాయ అధికారిణి హరిప్రియ

మదనపల్లె, ఆగస్టు 11: (gtvmedia)రైతులు దేశీ విత్తనాలను వినియోగిస్తూ బహుళ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారిణి హరిప్రియ సూచించారు.

మంగళవారం మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీలో ఇన్‌చార్జి ఏడీఏ నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో “పొలం పిలుస్తోంది–రైతన్న మీకోసం” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారిణి హరిప్రియ హాజరై రైతులకు పలు సూచనలు చేశారు.

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు విత్తన గుళికలను తయారు చేసుకుని ప్రధాన పంటతో పాటు మరో ఐదు రకాల పంటలను సాగు చేయాలని ఆమె సూచించారు. PMDS విధానంలో పశుగ్రాసాన్ని పెంచుకోవడం ద్వారా పశుపోషణకు కూడా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

అనంతరం రైతు వెంకటరమణారెడ్డి సాగు చేసిన రాగి పంటను వ్యవసాయ అధికారిణి హరిప్రియ పరిశీలించారు. పంట సాగు విధానం, దిగుబడి తదితర అంశాలను రైతును అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో JDA కార్యాలయ వ్యవసాయ అధికారి నవంత్ బాబు, AEO శిరీష, మాస్టర్ ట్రైనర్ సుబ్బరామయ్య, రైతు సేవా కేంద్రం సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *