మదనపల్లి అక్టోబర్ 1 : మదనపల్లి మండలం ఆరోగ్యం వద్ద సగంలో నిలిపివేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని పూర్తిగా నిర్మించి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో తీసుకురావాలని బి వై ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ
మదనపల్లె గడ్డపై రూ. లక్ష కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు చేయ తలపెట్టిన ప్రతిష్టాత్మక ఉద్యానవన హబ్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రిy చంద్రబాబు , కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి స్వాగతం అన్నారు.
మదనపల్లె ప్రాంతంలో ఈ ఉద్యానవన హబ్ ఏర్పాటు కావడం ఇక్కడి రైతులకు, ప్రజలకు ఎంతో ఆనందదాయకమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మదనపల్లె ప్రజల ఆరోగ్యం మరియు సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం క్రింది ముఖ్యమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని వారు కోరారు:
వైద్య కళాశాల పూర్తి: గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై అర్ధాంతరంగా నిలిచిపోయిన మదనపల్లె ప్రభుత్వ వైద్య కళాశాలను పూర్తి చేయాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం పీపీపీ (PPP) విధానంలో ఈ కళాశాలను పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదని, వెంటనే పనులు చేపట్టి ప్రజలకు వైద్య విద్య మరియు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
బి.టి. కళాశాల అభివృద్ధి & యూనివర్సిటీ హోదా: చారిత్రాత్మక నేపథ్యం కలిగిన బి.టి. కళాశాల (BT College) ప్రస్తుతం మూతపడే స్థితికి చేరిందని, ఎన్నికల హామీ మేరకు దీనిని తక్షణమే విశ్వవిద్యాలయంగా ప్రకటించి అభివృద్ధి చేయాలని
పునీత్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మదనపల్లి మెడికల్ కాలేజ్ అని త్వరగా ప్రారంభించాలి
