మదనపల్లి: మదనపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి శ్రీరామ కుమార్ (శ్రీరామ్ చినబాబు) 30వ వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తబస్సుం గారికి మద్దతుగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ప్రజలతో మమేకమవుతూ, వారి ఆదరాభిమానాలను స్వీకరిస్తూ మదనపల్లి అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగారు. కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి విజయానికి సహకరించాలని ప్రజలను కోరారు.


#Madanapalle #Chinababu #TDP #MunicipalElections #CycleSymbol
