మదనపల్లిలో 13, 14, 41వ వార్డుల్లో MLA షాజహాన్ బాషా,శ్రీరామ్ చినబాబు విస్తృత ప్రచారం

మదనపల్లి: మదనపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి శ్రీరామ కుమార్ (శ్రీరామ్ చినబాబు) ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషాతో కలిసి 13, 14, 41వ వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. భారీ జనసందోహం మధ్య సాగిన ఈ ప్రచారంలో స్థానిక కౌన్సిలర్ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బాబు నాయుడు, 14వ వార్డు అభ్యర్థి లక్ష్మీ దీపిక, 41వ వార్డు అభ్యర్థి నాగార్జున బాబు (గాంధీ)లకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ, మదనపల్లి అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనతో పాటు వార్డు కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో మదనపల్లిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా పాల్గొనడంతో ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

#Madanapalle #Chinababu #TDP #MunicipalElections #CycleSymbol

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *