కురబలకోట అక్టోబర్ 6 : స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న వర్ధంతి సందర్భంగా వడ్డెర సంఘం నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. కురబలకోట మండలం విశ్వం కళాశాల సర్కిల్ వద్ద వడ్డే ఓబన్న చిత్రపటానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రెడ్డెప్ప మాట్లాడుతూ తొలి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారు ఒడ్డే ఓబన్న దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన మహనీయుడు వారిని అదర్దర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు బీజేపీ నాయకుడు బండి ఆనంద్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులను గౌరవించుకొని రాబోయే తరాలకు వారి త్యాగాలను గుర్తు చేస్తూ యువత ముందుకు సాగాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రసాద్,రాజు చలపతి,గుణభూషణ్ ,హరి,రెడ్డిశేఖర్,వేణుగోపాల్ రామచంద్ర,వెంకటేష్ నాగరాజు,ఆనంద్,వేదనారాయణ రెడ్డి మరియు వడ్డెర సంఘం నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పెద్దయెత్తున
ఘనంగా వడ్డే ఓవన్న వర్ధంతి
