మదనపల్లి అక్టోబర్ 24 : అన్నమయ్య జిల్లాలోని రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని ట్రాన్స్కో ఎస్సీ సోమశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని సిపిఎం సబ్ స్టేషన్ లో 8 ఎంబీఏ ట్రాన్స్ఫార్మర్ ని ఎస్ఈ ప్రారంభించారు. జిల్లాకు అదనంగా సబ్స్టేషన్లో మంజూరయ్యాయని వీటి నిర్మాణం పూర్తయ్యాక వాటిలో పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చేస్తామన్నారు. ట్రాన్స్కో ఈలో గంగాధరం, విజయభాస్కర్, ఏడిఈ సురేంద్రనాయక్ ఏ ఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు
రైతులకు 9 గంటల పాటు విద్యుత్ సరఫరా
