మదనపల్లిలో భారీ సభ విజయవంతం.. ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు నారా లోకేష్ అభినందనలు

మదనపల్లె: మదనపల్లిలో నిర్వహించిన భారీ సభ విజయవంతం కావడంపై ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆత్మీయంగా అభినందించారు.

సభ అనంతరం తిరుగు ప్రయాణంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలిసిన నారా లోకేష్.. సభ విజయవంతం కావడంలో ఆయనతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన కృషిని అభినందించారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషాను ఆత్మీయంగా కౌగిలించుకుని అభినందనలు తెలిపారు.

నాయకులు, కార్యకర్తల సమన్వయంతో భారీ సభ విజయవంతంగా నిర్వహించడంపై నారా లోకేష్ ప్రశంసలు వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా నారా లోకేష్–షాజహాన్ బాషా మధ్య చోటుచేసుకున్న ఆత్మీయ కలయిక కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *