మట్టి వినాయక విగ్రహాలే ఉత్తమం

మదనపల్లి సెప్టెంబర్ 12: పిఓపి తో తయారు చేసిన విగ్రహాల కన్నా… కాలుష్య నివారణకు మట్టి విగ్రహాలే ఉత్తమమని సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి పేర్కొన్నారు. శనివారం స్థానిక రెడ్డప్ప నాయుడు కాలనీ వద్ద జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన సబ్ కలెక్టర్ కళ్యాణి మాట్లాడుతూ.. చిన్నవైన మట్టి విగ్రహాలతోనే పూజలు చేస్తే ముక్తి మార్గం వస్తుందని అభిప్రాయపడ్డారు.
పిఓపి తో తయారు చేసే విగ్రహాలు నిమజ్జనం సమయంలో చెరువు నీటిలో కరగవని, దీనివలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందన్నారు.
ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి మట్టి విగ్రహాలతోనే వినాయక పూజలు చేయాలని సబ్ కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధా, ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *