మదనపల్లె: అక్టోబర్ 12:గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా ‘పల్లె పండగ 3.0’ కార్యక్రమం కింద మదనపల్లె రూరల్ మండలంలోని కురవంక పంచాయతీలో పలు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా భూమిపూజ నిర్వహించారు.
కురవంక పంచాయతీ పరిధిలోని సాయిబాబా టెంపుల్ వెనుక ప్రాంతంలో, విద్యానగర్ రోడ్డు నుంచి కోళ్ల బైలు కాలనీ వరకు, కోళ్ల బైలు-1, కోళ్ల బైలు-2 గ్రామాల్లోని పలు ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సీసీ రోడ్ల నిర్మాణంతో ఆయా ప్రాంతాల ప్రజల రాకపోకలకు సౌకర్యం కలగనుంది.


