మదనపల్లె: అక్టోబర్ 12;పట్టణ అభివృద్ధిలో భాగంగా వివిధ వార్డుల్లో నూతనంగా మంజూరైన సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా భూమిపూజ నిర్వహించారు.
మదనపల్లె పట్టణంలోని 10వ వార్డు శివజ్యోతి నగర్లో సీసీ రోడ్డు నిర్మాణానికి, 13వ వార్డు మోతీనగర్ సచివాలయం జంక్షన్ రోడ్డు వద్ద, 30వ వార్డు ప్రశాంత్ నగర్లో, 32వ వార్డు రెడ్డీస్ కాలనీలో, 35వ వార్డు మారుతి నగర్లో నూతనంగా మంజూరైన సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక కూటమి నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
