మదనపల్లి నవంబర్ 12: పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పాల్గొన్నారు.
ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు.
పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.
ప్రజలు భయాందోళనలు లేకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్, ఎస్పీ కోరారు.
